వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై మంత్రులది తలోదారి

YS Jagan
హైదరాబాద్‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపై మంత్రులు తలోదారి తొక్కుతున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రముఖ దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. కొంత మంది మంత్రులు తటస్థంగా వ్యవహరిస్తుండగా, మరికొంత మంది పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఓదార్పు యాత్ర చేపట్టకూడదని భావిస్తున్నారు. జగన్ కు అన్ని విధాలా వెన్నంటి ఉండి నడుస్తామని హామీ ఇస్తున్న మంత్రుల్లో బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాత్రమే ఉన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి మాత్రం పార్టీ అధిష్టానం అనుమతి లభిస్తేనే ఓదార్పు యాత్ర చేపట్టాలని జగన్ కు సూచన చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మరి కొంత కాలం ఆగాలని వీరు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. హైదరాబాదుకు చెందిన దానం నాగేందర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ తమ అభిప్రాయాలను బయటకు చెప్పడం లేదు. అయితే కొంత మంది మంత్రుల కుమారులు, బంధువులు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. వీరిలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెల 8వ తేదీన అధిష్టానం అనుమతి ఇవ్వకున్నా ఓదార్పు యాత్ర చేపట్టడం ఖాయమని భావిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెసు రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+