హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మొండితనంతో సమస్య: సోనియాకు డిఎస్ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు జగన్‌ ఓదార్పు యాత్ర ప్రయత్నాల వల్ల అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అధిష్ఠానానికి వివరించినట్లు తెలుస్తోంది. మంగళవారం సోనియా, మొయిలీలతో చర్చల్లో జగన్‌ యాత్ర ప్రస్తావనే రాలేదని డీఎస్‌ విలేకరులకు చెప్పినప్పటికీ యాత్ర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనను ఆయన అధిష్ఠానంతో పంచుకున్నట్లు సమాచారం. తను, రోశయ్యసహా రాష్ట్రంలో ఏ కాంగ్రెస్‌ నేత చెప్పే మాటనూ వినే స్థితిలో జగన్ లేరని, హైకమాండ్‌ మాత్రమే ఆయన్ను నియంత్రించగలదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రకు సంబంధించి అధిష్ఠానం నుంచి జగన్‌కు గానీ, పీసీసీకి గానీ స్పష్టమైన సందేశం లేకపోవడం కూడా ప్రస్తుత గందరగోళానికి కారణమని డిఎస్ చెప్పినట్లు సమాచారం. ఈ అస్పష్టత కారణంగానే జగన్‌ తిరిగి జులై 8 నుంచి ఓదార్పు యాత్రను తలపెట్టారని వివరించినట్లు సమాచారం. జగన్ ‌ను ఢిల్లీకి పిలిచి ఆయన వాదన విని, సమాధాన పరచి పంపాలని సూచించించినట్లు సమాచారం.

జగన్‌ యాత్ర స్వభావ స్వరూపాలను, దానివల్ల పార్టీ కేడర్‌లో తలెత్తే గందరగోళాన్ని అధిష్ఠానం ముందు ఉంచుతూ, ఇది పార్టీకీ, ప్రభుత్వానికీ పెద్ద సవాలుగా మారనుందని డీఎస్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. యాత్రకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎవరమూ వ్యతిరేకం కాదని, ఆయన మొండి పట్టుదలే పార్టీకి, ప్రభుత్వానికీ సమస్యగా తయారైందని చెప్పినట్లు సమాచారం. తన యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని, అది అడ్డుకోజూస్తోందనే వాదనకు బలం చేకూర్చుకోవడానికి జగన్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని డీఎస్‌ అధిష్ఠానానికి నివేదించారు. యాత్ర వల్ల పార్టీలో గందరగోళం నెలకొనడమే కాకుండా రాష్ట్ర కేబినెట్‌ యాత్ర అనుకూల, వ్యతిరేక, తటస్థ వర్గాలుగా చీలిపోయిందని సమాచారం అందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X