ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదు: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

Palwai Govardhan Reddy
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు విషయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్యయ్యపై తాము చేస్తున్న పోరాటం విషయంలో ఎవరు ఫోన్‌ చేసినా ఆగేది లేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. పొన్నాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ ఫోన్‌చేసి బహిరంగ విమర్శలు చేయవద్దని సూచించారు. దీనిపై పాల్వాయి వివరణ కూడా ఇచ్చారు. అన్ని విషయాలు గవర్నర్‌ను కలిసి ఆయనకు వివరిస్తానని పాల్వాయి స్పష్టం చేశారు. మొయిలీ తనను ఢిల్లీ రమ్మన్నారని, ఢిల్లీ వెళ్లి సోనియాను, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను కలిచే యోచనలో ఉన్నామని గోవర్దన్ ‌రెడ్డి తెలిపారు.

అయితే మొయిలీ ఫోన్ వచ్చిన తర్వాత కాంగ్రెసు సీనియర్ నాయకులు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదని ప్రకటించిన తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అయితే, గవర్నర్ తో భేటీకి కొంత మంది సీనియర్లు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా, గవర్నర్ కు జలయజ్ఞంపై ఫిర్యాదు చేయకుండా, పోలవరం డిజైనింగ్ మార్చాలని మాత్రమే వారు గవర్నర్ ను కోరారు. తాము ప్రభుత్వంపై గానీ, ఇతరులపై గానీ ఫిర్యాదు చేయలేదని పాల్వాయి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+