రగులుతున్న పోలవరం వివాదం: వీరప్ప మొయిలీ జోక్యం

పోలవరం వివాదానికి స్వస్తి చెప్పాలని ఆయన గోవర్దన్ రెడ్డి సూచించారు. బహిరంగ విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టం చేస్తుందని ఆయన అన్నారు. పోలవరంపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు. అయితే తాము గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామని, పోలవరంపై ఫిర్యాదు చేయడానికి కాదని పాల్వాయి మొయిలీతో చెప్పారు. కాగా, బయటా, లోపలా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications