కంప్యూటర్ల దొంగగా మారిన హైదరాబాద్ టెక్కీ

లండన్ లోని ఇంటర్నెట్ స్కూల్లో ఎంఎస్ పూర్తి చేసిన ప్రశాంత్ కుమార్ 2006లో హైదరాబాద్ తిరిగి వచ్చి ఎర్రమంజిల్ కాలనీలోని అనురాగ్ అపార్టుమెంటులో ఉంటున్నాడు. అయితే అతనికి తగిన ఉద్యోగం లభించలేదు. దీంతో సమయం గడపడానికి సైబర్ కేఫ్ లకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అయితే ఖర్చులకు డబ్బులు లేకపోవడం కంప్యూటర్లను దొంగిలించి అమ్ముకోవడం ప్రారంభించాడని పోలీసులు చెప్పారు. హైదరాబాద్, సైబరాబాదుల్లో ప్రశాంత్ కుమార్ 13 నేరాలకు పాల్పడినట్లు పోలీసు అధికారి నాగేశ్వర రావు చెప్పారు. అతని నుంచి పోలీసులు 44 కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications