రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా 17 మంది మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పెళ్లికుమార్తె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఆరుగురు బ్యాండ్ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో వాతావరణం చాలా భయానకంగా ఉంది. క్షతగాత్రులు ఎక్కువగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతదేహాలను 108 సిబ్బంది వెలికితీసి వరంగల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. ఎస్పీ సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదానికి గల కారణాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications