నేను రాజకీయాల కోసం రాలేదు: చంద్రబాబు నాయుడు

మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ వాటిని ఏటీఎం కేంద్రాలుగా మార్చేశారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అవసరమైతే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు కూడా రాష్ట్ర మంత్రులు సిద్ధమవుతారని ధ్వజమెత్తారు. పేద ప్రజలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంపాదించినదంతా మద్యానికే పోయాల్సి వస్తోందని విమర్శించారు. అంతకుముందు స్థానిక విద్యార్థులతో భేటీ అయిన చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షా డెబ్భైవేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ప్రస్తుత సర్కారు వారికి ఉపకార వేతనాలు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications