నిజామాబాద్ లో డిఎస్ కు తెలుగుదేశం చెక్

నిజామాబాద్ నియోజకవర్గంలో డిఎస్ పై లక్ష్మినారాయణనే తిరిగి పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మైనారిటీ అభ్యర్థి అలీమ్ ను పోటీకి దించుతోంది. గత ఎన్నికల్లో మైనారిటీలను ఆకట్టుకోవడానికి డిఎస్ చేసిన ఓ వ్యాఖ్యతో హిందువులు ఆగ్రహం చెంది బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణను గెలిపించారనే అభిప్రాయం ఉంది. మైనారిటీ ఓట్లకు గండిపెడితే డిఎస్ విజయాన్ని అడ్డుకోవచ్చుననే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావించి అలీమ్ ను పోటీకి దించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. లక్ష్మినారాయణకు తెరాస కూడా మద్దతిస్తోంది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం కూడా డిఎస్ కు సహకరించే అవకాశం లేదు. పైగా, డిఎస్ కు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో డిఎస్ కు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో విజయం సాధించడం సులభమేమీ కాదంటున్నారు.












Click it and Unblock the Notifications