హైదరాబాద్: ఊహించినట్టుగానే తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికలకు ప్రజారాజ్యం పార్టీ దూరంగా ఉండనుంది. ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యాం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు ఆపార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు తమ ఇష్టానుసారంగా ఓటు వేయవచ్చని ఆయన గురువారం ఇక్కడ తెలిపారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందరూ గౌరవించాలని, ఈ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం కాదన్నారు. ప్రజల భావోద్వేగాలను టీఆర్‌ఎస్ రెచ్చగొడుతోందని కోటగిరి మండిపడ్డారు.