మహబూబ్ నగర్: నిండు గర్భిణిని అత్తింటివారు వేధించి చంపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వరకట్న వేధింపులకు అరుంధతి అనే మహిళ బలైంది. తనకు పెళ్లికి ముందు బైక్ ఇస్తామని చెప్పి పెళ్లై రేండేళ్ళు గడిచినా ఇంతవరకు వాహనం ఇవ్వలేదని అరుంధతి భర్త రోజూ వేదింపులకు గురిచేసేవాడు. ఏడు నెలల గర్భిణి అని చూడకుండా గత రాత్రి అత్తింటివారు ఆమెను తీవ్రంగా హింసించి, ఉరివేసి చంపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అరుంధతి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.