భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల, కాణిపాకం

ఇలా ఉండగా కాణిపాకంలో కూడా గురువారం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం వేకువజామున పెళ్లి ముహుర్తాలు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని 10, 51, 100 రూపాయల క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపల వరకు భక్తులు క్యూకట్టారు. వీరికి శీఘ్ర దర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహాలఘుదర్శనాన్ని ఏర్పాటు చేశారు. రద్దీతో భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి.












Click it and Unblock the Notifications