మరో వివాదంలో మంత్రి వాసంశెట్టి, వైసీపీ నేతలతో కలిసి- చంద్రబాబు హెచ్చరించినా..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం తో ఉన్నారు. ఇప్పటికే బోండా ఉమా వివాదం సమయంలో చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరూ వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవద్దని తేల్చి చెప్పారు. కాగా.. ఇప్పుడు ఏకంగా మంత్రి వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదిక పైన ఉండటం మరోసారి చర్చగా మారింది. ఇప్పుడు ఈ మంత్రి పైన సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

రాష్ట్రంలో కొత్త రాజకీయం కొనసాగుతోంది. కూటమి- వైసీపీ మధ్య రాజకీయ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. వైసీపీ నేత లతో టీడీపీ నేతలు ఎవరైనా కలిసి వేదిక పంచుకున్నా.. కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కనిపించటం లేదు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబు తో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో, టీడీపీ అధినాయకత్వం ఈ పరిణామాల పైన సీరియస్ అయింది. పార్టీ నేతలు వైసీపీ తో కలిసి వేదిక పంచుకోవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కమిటీ ముందు బోండా ఉమా హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. అయితే, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పు గోదావరిలో జరిగిన కార్యక్రమం లో వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి పొల్గొన్నా.. వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటమే ఇప్పుడు చర్చగా మారింది.

 TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
minister-vasamsetti-subhash-sharing-stage-with-ycp-leaders-in-east-godavari-district-sparks-politic

గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు

కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని చీడిగలో ప్రతిష్ఠించారు. రాజమండ్రి వైసీపీ నేత పాలిక శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు విగ్రహావిష్కరణ చేపట్టారు. ఈ వేడుకకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తో పాటుగా కాకినాడ రూరల్ టీడీపీ నేతలు సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే, కార్యక్రమ నిర్వాహకుడైన వైసీపీ నేత పాలిక శ్రీనుతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులతో మంత్రి సుభాష్ ఒకే వేదిక పంచుకోవడం చర్చకు దారితీసింది. తాజాగా బోండా ఉమా వ్యవహారం తరువాత వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు ఎవరైనా ఒకే వేదిక పంచుకుంటే పార్టీలో చర్చగా మారుతోంది. ఇప్పుడు మంత్రి ఏకంగా ఇలా చేయటంతో టీడీపీ లోని కొందరు నేతలు తప్పుపడుతూ, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం పైన టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+