ఈ ప్రభుత్వం నుంచి తిరుమల శ్రీవారే రక్షించుకుంటాడు: చంద్రబాబు

కర్నాటక ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన ఆల్మట్టిపై వాదనలు సమర్థంగా వినిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే కృష్ణా ట్రిబ్యునల్ కర్నాటకకు అనుకూలంగా తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు ఎక్కువగా ఉందనే విషయంలో తాము గతంలో అప్పటి ప్రధాని దేవెగౌడపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామని ఆయన చెప్పారు. కృష్ణా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే హక్కు ఉంటుందని, ఆ జలాలపై ఆధారపడి ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను తలపెట్టిందని ఆయన చెప్పారు.
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులను ఆపించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బాబ్లీ విషయంలో ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై తాము పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications