ఆజాద్ ను నాగపూర్ లో పట్టుకున్నారు: మావోయిస్టు నేత ఉసెండి

ఆజాద్ తో ముఖాముఖి తలపడే చేవ ఎవరికీ లేదని, ఆజాద్ ను చాలా కాలంగా అనుసరిస్తూ పట్టుకుని కాల్చి చంపారని ఆయన అన్నారు. శాఖమూరి అప్పారావుతో పాటు ఆజాద్ మరణించి ఉంటాడని భావించామని, అయితే ఆ తర్వాత ఆజాద్ కాంటాక్టులోకి వచ్చాడని ఆయన చెప్పారు. శాఖమూరి అప్పారావుకు, ఆజాద్ కు సన్నిహిత సంబంధాలున్నాయని, తరుచూ వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారని ఆయన చెప్పారు. రాత్రంతా వారిద్దరి చిత్రహింసలు పెట్టి చంపేసి ఉంటారని ఆయన అన్నారు. ఇందులో ఆంధ్ర ఎస్బీఐది కీలక పాత్ర అని ఆయన ఆరోపించారు.
ఆజాద్ ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్ వేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవర రావు నిర్ణయించుకున్నారు. ఆజాద్ సోదరులు హైదరాబాదులోని మూసారాంబాగ్ ప్రాంతంలో ఉంటారని తెలుస్తోంది. ఆజాద్ తల్లిదండ్రులిద్దరు ఉపాధ్యాయులే. ఆజాద్ కుటుంబ సభ్యులు నూజివీడు ప్రాంతంలో ఉండేవారు. ఆజాద్ వరంల్ ఆర్ఇసీలో బిటెక్, ఆంధ్ర యూనివర్శిటీలో ఎంటెక్ చేశాడు. 1970 నుంచి అతను ఉద్యమంలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications