ఓదార్పునకు జగన్ ఏర్పాట్లు: పట్టు వీడన హైకమాండ్

శాసనసభ్యుడు కొండ్రు మురళి మాత్రం జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మంత్రులు, శాసనసభ్యులు తమ వారసులను జగన్ ఓదార్పు యాత్రకు పంపడమే కాకుండా వారితో ఏర్పాట్లు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో చెప్పారు. అయితే, అది మాట వరుసకు మాత్రమే ఆయన అన్నారు. జగన్ వ్యవహారమంతా అధిష్టానమే చూసుకుంటుండడంతో ఆయన ఆ మాట అన్నారు. అయితే, జగన్ ఓదార్పు యాత్ర విషయంలో రెండో మాట లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.












Click it and Unblock the Notifications