హైదరాబాద్: పోలీసు ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు నేత ఆజాద్(చెరుకూరి రాజ్ కుమార్) కు కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన భౌతికకాయానికి కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలు, బంధుమిత్రులు నివాళులర్పించారు. గద్దర్, మందకృష్ణ, వరవరరావు, సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు నారాయణ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ వేణు తదితరులు హాజరైయ్యారు.