హైదరాబాద్: ప్రదాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టుకు, తిరుపతి విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది. వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు.
ఇప్పటికే మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం పలు మార్లు వాయిదా పడింది. ప్రధాని పర్యటన వాయిదా పడినట్లు ప్రధాని కార్యాలయం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.