రియాద్ రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర వ్యక్తి మృతి

ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు కదిరిలోని తన భార్య గులాబ్‌జాన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా డబ్బు లేక కుటుంబం పడుతున్న అవస్థల గురించి ఆమె భర్తకు వివరించింది. గంట తర్వాత మరోసారి సౌదీ నుంచి ఫోన్ వచ్చింది. తన భర్తే ఫోన్ చేసి ఉంటాడని ఆత్రుతగా ఆమె ఫోన్ రిసీవ్ చేసుకుంది. అయితే బాబాఫక్రోద్ధీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని సమీప బంధువు పిడుగులాంటి వార్త చెప్పాడు. 9 నెలలుగా జీతాల్లేక తాను పడుతున్న అవస్థలు, కదిరిలో కుటుంబ స్థితిగతుల గురించి ఆలోచించుకుంటూ ఏమరుపాటుగా వెళ్తున్న ఫక్రోద్దీన్‌ను అతి వేగంగా వెళుతున్న టిప్పర్ ఢీకొన్నట్టు ఫోన్ చేసిన వారు చెప్పారు. మృతదేహాన్ని భారతదేశానికి తెప్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications