తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు రెడీ

మద్యం, ఫీజుల రీయంబర్స్ మెంటు విషయాల్లో ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. మద్యం షాపులకు అనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ప్రార్థనా స్థలాలకు, విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీతో పాటు ఇతర ప్రాజెక్టులను ఆపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి ప్రభుత్వం సామాన్యులపై పెను భారం మోపిందని, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications