అధిష్టానంతో పెట్టుకుంటే వైయస్ జగన్ జీరో అవుతారు: కాంగ్రెసు సీనియర్లు

ఎంత పెద్ద నాయకుడైనా, కార్యకర్త అయినా పార్టీ అధిష్టానం మాట వినాల్సిందేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. గతంలో జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఏమీ కాకుండా పోయారని, అధిష్టానాన్ని ధిక్కరిస్తే జగన్ కు కూడా అదే గతి పడుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ అధిష్టానంతో పెట్టుకుంటే జగన్ కు భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications