ఓదార్పుపై వైయస్ జగన్ మీద ఈసారి చర్యలు తప్పవా?

అభిషేక్ సింఘ్వీ మాటలను బట్టి జగన్ తో అమీతుమీ తేల్చుకోవడానికే కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని అధిష్టానం చేసిన సూచనను ఆయన గతంలో ధిక్కరించారు. అయితే, తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆ యాత్రను ఆయన వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత జగన్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ఇతర అధిష్టానం నేతలను కలుసుకుని వివరణ ఇచ్చుకున్నారు. దాంతో అధిష్టానం చల్లబడింది. అయితే ఓదార్పు యాత్రకు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కానీ జగన్ పై చర్యలకు ఉపక్రమించలేదు.
ఇప్పుడు సోనియా స్వయంగా చెప్పినప్పటికీ జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోకపోవడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. జగన్ తన దారిన తాను మొండిగా ఓదార్పు యాత్రకు వెళ్తే చర్యలు తప్పకపోవచ్చునని అంటున్నారు. తొలుత షోకాజ్ నోటీసు ఇస్తారా, నేరుగా సస్పెండ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications