అసెంబ్లీ సమావేశాలపై రోశయ్య, చంద్రబాబు మాటకు మాట

Assembly
హైదరాబాద్: శాసనసభ వర్షాకాలం సమావేశాల విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పరస్పరం విభేదించారు. చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నందున సమావేశాలను ఎక్కువ కాలం నిర్వహించాలని చంద్రబాబు అభిప్రాయపడగా అవసరం లేదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన బిఎసి సమావేశంలో రోశయ్య, చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. శాసనసభా సమావేశాలను కనీసం పది రోజులైనా నిర్వహించాలని చంద్రబాబు అన్నారు. వంద రోజలు సమావేశాలు నిర్వహిస్తామన్న మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు.

శాసనసభా సమావేశాలు నాలుగు రోజులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని రోశయ్య చెప్పారు. ఉప ఎన్నికలు ఉన్నందున సమావేశాలను ఎక్కువ కాలం నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 15వ తేదీ వరకు సమావేశాలను పొడగించడానికి రోశయ్య అంగీకరించారు. సమావేశాల్లో మద్యం టెండర్లు, మహారాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న బాబ్లీ ఇతర అక్రమ ప్రాజెక్టులు, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో జరిగే చర్చల కన్నా బయట చేస్తున్న ఆందోళనలకే స్పందన ఎక్కువగా వస్తోందని చిరంజీవి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+