వైయస్ జగన్ శ్రీకాకుళం యాత్ర వివరాలు ఇవి...

దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మండలంలోని లొద్దపుట్టి చేరుకొని పైల చంద్రమ్మ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. 11 గంటలకు కవిటి మండలం జగతి గ్రామానికి చేరుకొని రెడ్డి అప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు కంచిలి మండలం కేసరపడ గ్రామానికి చేరుకుని పిలక గణపతి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 1 గంటకు సోంపేట గాంధీ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1.45 గంటలకు మందస మండలం హరిపురం చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు మందస మండలం సున్నాదేవి గ్రామంలోరెయ్యి తాతమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు. 3 గంటలకు కాశీబుగ్గ మీదుగా పలాస చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామంలో మార్పు కృష్ణారావు కుటుంబాన్ని ఓదారుస్తారు. 3.45 గంటలకు నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని రత్నాల నిర్మల కుటుంబాన్ని పరామర్శిస్తారు.
సాయంత్రం 4.30 గంటలకు సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి వెళ్లి బత్తిన రామారావు కుటుంబాన్ని ఓదారుస్తారు. 5.15 గంటలకు సంతబొమ్మాళి మండలం నౌపడ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం 116 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 6 గంటలకు టెక్కలి చేరుకొని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.












Click it and Unblock the Notifications