వైయస్ జగన్ కోసం రాంబాబు దేనికైనా సిద్ధమ్మన్నట్టు....

Ambati Rambabu
హైదరాబాద్‌: వైయస్ జగన్ కు అతను అత్యంత ఆప్తుడు. షోకాజ్‌ నోటీసు అందిన తర్వాత కాంగ్రెసు పార్టీ క్రమశిక్షణా సంఘం ముందే స్పందిస్తానని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెసు యువ ఎం.పి వైయస్ జగన్‌ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి లేదు కనుక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరూ వెళ్లరాదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై అంబటి ఈ నెల 6వ తేదీన తీవ్రంగా స్పందించారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘన చర్య కింద పరిగణిస్తూ కొందరు పీసీసీ ఆఫీస్‌ బేరర్లు ఆయనపై అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు షోకాజ్‌ నోటీస్‌ జారీ అయ్యింది.

నోటీసు జారీ అయిన విషయంపై అంబటిని 'న్యూస్‌లైన్‌' సంప్రదించగా 'షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లుగా టీవీ స్క్రోలింగ్‌ ద్వారానే నాకు తెలిసింది. నాకు ఇంకా నోటీసు అందలేదు. నేను చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తాయని నేను అనుకోవటం లేదు. నోటీసు అందిన తర్వాత మా పార్టీ క్రమశిక్షణా సంఘం ముందే నేను స్పందిస్తాను. ఇది పార్టీ అంతరంగిక వ్యవహారం కనక ఇంతకన్నా ప్రస్తుతం ఏమీ మాట్లాడను' అని స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+