నిజామాబాద్: ఉప ఎన్నికల్లో నిజామాబాద్ స్థానానికి ఎంతో ప్రాధాన్యముందని... తెలంగాణవాదం గెలవాలంటే పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఓడించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పట్టణంలో భాజపా అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మత్యాగాలు చేశారని వారి త్యాగాలు వృథా కాకూడదంటే భాజపా అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే తెలంగాణ వాదం గెలవడం ఖాయమని కిషన్‌రెడ్డి అన్నారు.