మీ అభిమానంతోనే చిరునవ్వుతో నిలబడుగలుగుతున్నా: వైయస్ జగన్

పది నెలల క్రితం నాన్న చనిపోయినప్పుడు తానొక్కడినే కొండంత అండను కోల్పోయినట్లు బాధపడ్డానని, జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు చూసిన తర్వాత తానొక్కడినే కాదు, కోట్ల మంది కొండంత అండను కోల్పోయారని తెలుసుకున్నానని ఆయన అన్నారు. తన పేరును తలుచుకుని కన్నీరు పెట్టించే గొప్ప నాయకుడు వైయస్ అని ఆయన అన్నారు. జగన్ తన ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం ఉదయం అన్నవరంలోని సత్యదేవుడిని సందర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications