చంద్రబాబు నాయుడుకు ఊరట: మద్యం టెండర్లపై పిటిషన్ కొట్టివేత

Chandrababu Naidu
న్యూఢిల్లీ: మద్యం టెండర్ల విధానంపై కేసులో తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని టెండర్ల విధానాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెసు లీగల్ సెల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని టెండర్ల విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రకంగా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా సమర్థించింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేశారని, ఇందుకు తెలుగుదేశం నాయకులకు ముడుపులు అందాయని కాంగ్రెసు లీగల్ సెల్ ఆరోపిస్తూ పిటిషన్ వేసింది. లీగల్ సెల్ ఆరోపణలకు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో హైకోర్టులో తాను వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో కాంగ్రెసు లీగల్ సెల్ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+