వ్యక్తుల వల్ల కాంగ్రెసు పార్టీ చలించదు: వైయస్ జగన్ పై రోశయ్య

స్థిరత్వానికి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రస్తుత లక్ష్యమని ఆయన అన్నారు. విషాదకరమైన సందర్భంలో పార్టీ అధిష్టానం తనకో లక్ష్యాన్ని ఇచ్చిందని, దాన్ని సాధించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నాయకులకు అవకాశాలు కల్పిస్తుందని, వాటిని వాడుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరీక్షణ క్రీడను ఆడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాను చిరంజీవి అభిమానిని అని, చిరంజీవి మామ అల్లు రామలింగయ్య తనకు సన్నిహిత మిత్రుడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications