వైయస్ జగన్ కు పొమ్మనలేక పొగపెడుతున్న హైకమాండ్

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో సాచివేత ధోరణి అవలంభించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తోంది. జగన్ పై తొందరపడి కొరడా ఝళిపించకూడదనే వ్యూహంతో పని చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై వ్యాఖ్యలకు గాను జగన్ షోకాజ్ నోటీసు జారీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. పార్టీలో ఏకాకిని చేయడం ద్వారా జగన్ తన దారిని తాను వెతుక్కున్నట్లు చూడాలనేది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. జగన్ ను ఇక ఏ మాత్రం సహించే స్థితిలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ తన గోతిలో తానే పడేలా చూడాలని హైకమాండ్ ఎదురు చూస్తోంది.

జగన్ వ్యవహారాలను పట్టించుకోనట్లు వ్యవహరించడమే ప్రస్తుతం హైకమాండ్ అనుసరిస్తున్న వ్యూహంగా చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై పార్టీ నాయకులు మనోగతాన్ని ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జగన్ వ్యవహారశైలిపై వ్యతిరేకతను సామూహికంగా వ్యక్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంపై మొయిలీ ఇప్పటికే ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావులతో ఫోనులో మాట్లాడారు. కాగా, ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రోశయ్య ఢిల్లీ వస్తున్నారు. ఈ సమయంలో జగన్ వ్యవహారంపై అధిష్టానానికి చెందిన నాయకులు ఆయనతో మాట్లాడే అవకాశాలున్నాయి.

వైయస్ వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ పార్టీ పెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. అంత దాకా వేచి చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కాంగ్రెసు అధిష్టానం చూస్తోంది. ఈలోగా జగన్ వెంట వెళ్లేవారి గురించి ఆరాలు తీస్తోంది. అవసరమైతే జగన్ అనుచరులతో మాట్లాడి వారు వెళ్లకుండా చూసే ఎత్తుగడను కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్ ను ఏకాకిని చేయడమే ప్రస్తుతం పార్టీ అధిష్టానం కర్తవ్యంగా తోస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+