ఆంగ్ల దినపత్రికలపై వైయస్ జగన్ సాక్షి డైలీ మండిపాటు

జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రోశయ్య ఎన్డీటివికి ఇచ్చిన ఇంటర్వ్యూ నేపథ్యంలోనే ఆంగ్ల పత్రికలు జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రచురించాయని సాక్షి ఆరోపించింది. ముఖ్యమంత్రి ఇద్దరు ఆంగ్ల దినపత్రికల ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడి జగన్ పై వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయించారని సాక్షి చెప్పకనే చెబుతోంది. ఒక అనుకూలమైన సమయంలో రోశయ్య దిగిపోవాలని, ఆ స్థానంలో తనను కూర్చోబెట్టాలని, ఆ షరతు మీదనే ముఖ్యమంత్రిగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించారని, అందుకు రోశయ్య తిరస్కరించారని ఆంగ్ల పత్రికలు రాసినట్లు తెలిపింది. దాన్ని విషప్రచారంగా సాక్షి దినపత్రిక కొట్టి పారేసింది.
జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారంటూ మీడియా విషప్రచారానికి దిగిందని సాక్షి ఆరోపించింది. ఇదంతా జగన్ పై కుట్రలో భాగంగానే జరిగిందని అభిప్రాయపడింది. పార్టీ అధిష్టానానికి, జగన్ కు మధ్య దూరం పెంచడానికే ఈ విషప్రచారానికి దిగినట్లు ఆరోపించింది. మొత్తం మీద, జగన్ పై మీడియా, రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారనేది సాక్షి ప్రధాన ఆరోపణ.












Click it and Unblock the Notifications