తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ జగన్ పస లేని ప్రసంగం

ఎవరి కోసమో తాను విలువలను తగ్గించుకోలేదని ఆయన అన్నారు. ఎవరు తనతో ఉన్నా, ఎవరు తనతో లేకపోయినా ప్రజల అండదండలు, ఆప్యాయతలతో ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. నాన్న చనిపోయినప్పుడు నేను ఎకాకిని, ఒంటరి వాడ్ని అయ్యానని అనుకున్నానని, కానీ ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత మీరు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత చూసిన తర్వాత వైయస్ బతికే ఉన్నారని, ప్రజల గుండెల్లో ఉన్నాడని తెలిసి వచ్చిందని ఆయన అన్నారు. తనను తమ్ముడిలా దీవిస్తున్నారని, ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. మండుటెండులను కూడా లెక్క చేయకుండా ముఖాలపై చిరునవ్వుతో తాను ఆలస్యంగా వచ్చినా వేచి ఉండడాన్ని బట్టి ప్రజల ఆదరణ తనపై ఎంతగా ఉందో తెలిసి వస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications