సోంపేట ఘటనపై అట్టుడికిన అసెంబ్లీ: వాయిదా

Assembly
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా సోంపేట ఘటనపై గురువారం శాసనసభ అట్టుడికింది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఎన్ సిసి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణం వల్ల ఒక్క ప్రాణం పోయినా బాధ్యత వహిస్తానని చెప్పిన ధర్మాన ప్రసాద రావు రెచ్చగొట్టే ప్రకటన చేయడం వల్లనే ఇప్పుడు సోంపేట ఘటన చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి రోశయ్య ధర్మానను బర్తరఫ్ చేయాలని ఆయన అడిగారు. ప్రభుత్వం ఎన్ సిసి కొమ్ము కాస్తూ పేదలపై యుద్ధం ప్రకటించిందని ఆయన వ్యాఖ్యానించారు. సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని ఆయన అన్నారు.

నిర్మాణం వల్ల ప్రాణం పోతే బాధ్యత వహిస్తానని చెప్పానే తప్ప ఇతర కారణాల వల్ల ప్రాణాలు పోతే బాధ్యత వహిస్తానని చెప్పలేదని ధర్మాన వివరణ ఇచ్చారు. దేశంలో థర్మల్ విద్యుదుత్పత్తిని నిషేధించలేదని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యుడు సత్యానందరావు, సిపిఐ సభ్యుడు సాంబశివరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివరణ ఇవ్వడానికి ప్రయత్నించిన ధర్మానను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో సభ వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు లేదు. స్పీకర్ అనుమతితో మాట్లాడేందుకు ధర్మాన ప్రసాదరావు ప్రయత్నించారు. అయితే, ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను మరోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+