సోంపేట ఘటనపై తీవ్ర దుమారం: టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

అంతకు ముందు సోంపేట ఘటనపై పలుమార్లు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభం కాగానే ఈ ఘటనపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుంటూ స్పీకర్ పోడియాన్ని విపక్ష సభ్యులు చుట్టుముట్టారు. ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి పేరు చెప్తే వారిని తొలగించడానికి తాను సిద్ధంగా లేనని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.
సస్పెండ్ అయిన సభ్యులు సభను వెళ్లకపోవడంతో మార్షల్ రంగంలోకి దిగారు. మార్షల్స్ వారిని బయటకు గెంటివేశారు. ఆ తర్వాత తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి ఛేంబర్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడి నుంచి కూడా వారిని మార్షల్స్ చేత తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications