జగన్ ను మేం చూసుకుంటాం: రోశయ్యకు హైకమాండ్ భరోసా

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం మరోమారు ముఖ్యమంత్రి రోశయ్యకు భరోసా ఇచ్చింది. రోశయ్యకు పూర్తి మద్దతును ప్రకటించింది. పదవీ బాధ్యతల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధిష్ఠానం ఆశీస్సుల్ని అందుకున్నారు. తన ఢిల్లీ పర్యటనలో రోశయ్య కాంగ్రెసు అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో జరిపిన సమావేశాల్లో ఈ మేరకు సూచనలు అందినట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్నీ సహించబోదనీ, ఏ స్థాయి నాయకులనైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా రోశయ్యకు అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కడప ఎంపీ జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రాజకీయ ఉద్దేశాలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్‌ వ్యవహారాన్ని తాము చూసుకుంటామనీ, పాలన బాధ్యతలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది. జగన్‌ చేతల వల్ల కాంగ్రెసు నష్టపోయి, భవిష్యత్తులో ప్రతిపక్షాలకు ప్రయోజనం కలిగించకూడదని సూచించినట్లు సమాచారం.

తెలంగాణలోని ఉప ఎన్నికల గురించీ, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రమే నాయకత్వంతో చర్చించినట్లు ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే జగన్‌ వ్యవహారశైలిపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. జగన్ లక్ష్యాలు, ఉద్దేశాలు, పార్టీకి ఆయన కలిగించగలిగే నష్టం వంటి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు రాజకీయ సమస్యల్నీ, రాష్ట్రంలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లనీ వివరించినట్లు తెలుస్తోంది. బాబ్లీ, ఆలమట్టి ప్రాజెక్టుల అంశాన్నీ లేవనెత్తారు. దీనిని ప్రతిపక్షాలు ఉపయోగించుకోకుండా, సమస్యను పెద్దది చేయకుండా కాంగ్రెసు చూడాల్సి ఉందని రోశయ్య చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ నెల 23వ తేదీన ప్రధాని వద్దకు రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష బృందాన్ని తీసుకెళ్లడానికి ఆయనకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై అహ్మద్‌పటేల్‌ పూర్తిస్థాయిలో విచారించి, సీఎం నుంచి నేరుగా సమాచారం సేకరించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+