తప్పు చేసింది మహా ప్రభుత్వం, క్షమాపణ చెప్పాలి: టిడిపి

మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర పోతోందని ఆయన విమర్శించారు. బాబ్లీ వ్యవహారంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని జోక్యం చేసుకోకపోతే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్సించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కయిందని తెలుగుదేశం మరో నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు.












Click it and Unblock the Notifications