వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం వైఖరి మారిందా?

జగన్ వ్యవహారంపై కాంగ్రెసు అధిష్టానం మిన్నకుండే వైఖరిని అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో ఉండడమా, వేరు కుంపటి పెట్టుకోవడమా అనే విషయాన్ని జగన్ కే వదిలేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందువల్లనే జగన్ పై చర్య తీసుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానివల్లనే మొయిలీ ఆ ప్రకటన చేశారని అంటున్నారు. అయితే, జగన్ విషయంలో మాత్రం అధిష్టానం వైఖరి ఏ మాత్రం మారలేదని అంటున్నారు. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని మొయిలీ ప్రకటించినా పార్టీ అధిష్టానం అనుమతి లేదనే విషయం నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications