మారిన మహా పోలీసు వ్యూహం: ఎపికి చంద్రబాబు తరలింపు

తెలుగుదేశం నాయకులను ఉంచిన ధర్మాబాద్ లోని ఐటిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులపై పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. ఈ లాఠీచార్జీలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి ఓ టీవీ చానెల్ తో చెప్పారు. అక్కడి పరిస్థితులు వివరిస్తూ కొత్తకోట దయాకర్ రెడ్డి విలపించారు. తెలుగుదేశం నాయకుల వ్యక్తిగత సిబ్బందిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోకి తరలించారు. తెలుగుదేశం నాయకులను బృందాలుగా విడదీసి వాహనాల్లో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని కొత్తకోట దయాకర్ రెడ్డి చెప్పారు. తమ నేత చంద్రబాబును పోలీసులు తోసేశారని, పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications