నన్ను సస్పెండ్ చేసిన తీరు క్షోభ పెడుతోంది: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పకుండా క్షోభ పెడుతున్నారని సస్పెన్షన్ కు గురైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. తనకు సస్పెన్షన్ లేఖ ఇంకా రాలేదని ఆయన చెప్పారు. దాని వల్ల తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియడం లేదని ఆయన అన్నారు. సమాధానం ఇవ్వడానికి తనకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కోరారు. ఈ మేరకు తాను మొయిలీకి లేఖ రాస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను ముఖ్యమంత్రి మీద రాజకీయ విమర్శలు చేశానే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిపై, పార్టీపై గతంలో తన లాగా ఎంతో మంది విమర్శలు చేశారని, వారిపై చర్యలు తీసుకోకుండా తన ఒక్కడిపైనే చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. దుష్టశక్తులు, వర్గాలు తనపై కక్ష గట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని, దానికి తనను బలి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు తనపై సస్సెన్షన్ ఎత్తేయాలని, ఈలోగా తాను వివరణ ఇస్తానని, ఆ వివరణ నచ్చకపోతే తనపై చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి తాను విశేషమైన సేవలు చేశానని, పదవులు ఆశించలేదని, పార్టీ టికెట్లు అడగలేదని, వైయస్ పాద యాత్రలో చివరి దాకా పాల్గొన్నానని ఆయన చెప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+