వైయస్ జగన్ ఓదార్పు నుంచి దృష్టి మళ్లించడానికే బాబ్లీ డ్రామా?

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెసు పార్టీ తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కుంటోంది. శ్రీకాకుళం జిల్లాలో కన్నా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రలో ఎక్కువ మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. తన ఓదార్పు యాత్రలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెసును ఇరకాటంలో పెడుతున్నాయి. జగన్ అనుచరుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీకి మరిన్ని ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో పార్టీకి ఏదో మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్ర కాంగ్రెసు అధిష్టానానికి కలిసి వచ్చిందని అంటున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తో మాట్లాడి చంద్రబాబు యాత్రకు అధిక ప్రాధాన్యం లభించే ఏర్పాట్లు చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు ఎపిసోడ్ వల్ల వాస్తవంగానే జగన్ యాత్రకు ప్రాధాన్యం తగ్గింది.












Click it and Unblock the Notifications