వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో తగ్గిన ఎమ్మెల్యేల హల్ చల్

YS Jagan
కాకినాడ: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో శాసనసభ్యుల సందడి తగ్గింది. బుధవారంనాటి ఓదార్పు యాత్రలో శాసనసభ్యులు హడావిడి పెద్దగా కనిపించలేదు. ప్రధాన నాయకులు కూడా పెద్దగా యాత్రలో కనిపించలేదు. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గోపాలపురంలో, నరసాపురం శాసనసభ్యుడు ప్రసాదరాజు జొన్నాడలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు సిహెచ్ వేణుగోపాలకృష్ణ కూడా జగన్ ను పలకరించి వెళ్లారు. రాజోలు శాసనసభ్యుడు వరప్రసాద్ మాత్రం జగన్ వెంట ఉన్నారు. పలు సభల్లో ఆయన ప్రసంగించారు.

ఊలలంక సభ నుంచి మంత్రి సుభాష్ చంద్రబోస్, పార్టీ నాయకుడు కెవి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు కె. నిర్మలాకుమారి, మాజీ శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. కాగా, జగన్ ఓదార్పు యాత్ర చాలా ఆలస్యంగా జరుగుతోంది. జగన్ ఓదార్పు యాత్ర బుధవారంనాటికి పదో రోజుకు చేరుకుంది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో జగన్ తన ఓదార్పు యాత్రను ముగించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+