విజయవాడ: బాబ్లీ ప్రాజెక్టుపై హల్ చల్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిచిందని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు దానిపై ఏం చేశారని ఆమె అడిగారు.
కర్నాటకలో దేవెగౌడ 20 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కడుతుంటే అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయలేదని ఆమె అన్నారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆమె అన్నారు.