సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

కేసులు పెండింగ్ లో ఉన్నాయనే ఉద్దేశంతో తెలంగాణలోని పది స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించి, ఆ రెండు స్థానాలను ఇసి పెండింగ్ లో పెట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) హైకోర్టుకెక్కింది. ఆ రెండు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఇలి మిగతా పది స్థానాలతో పాటు వాటికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే, బుధవారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తెరాసకు, కేంద్ర ప్రభుత్వానికి, సొలిసిటర్, అటోర్నీ జనరల్ లకు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications