బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబు మరో డ్రామాకు తెర

Chandrababu Naidu
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ఆక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై మరో డ్రామాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెర తీయబోతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించడానికి అవసరమైన పథకాన్ని ఆయన రచించుకున్నారు. జాతీయ స్థాయిలో బాబ్లీ వివాదాన్ని చర్చనీయాంశం చేయడమే కాకుండా తెలంగాణలోని ఉప ఎన్నికల్లో ప్రచారానికి నాటకీయమైన ముగింపు ఢిల్లీ స్థాయిలో ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. శనివారం జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు చర్చించారు. ప్రధానితో రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష భేటీ సందర్భంగా అవసరమైతే అక్కడే నిరశన దీక్షను చేపట్టి హల్ చల్ సృష్టించే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

సోమవారం ప్రధాని అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష భేటీ ముందుంచాల్సిన డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు. సీడబ్లూసీ ఉత్తర్వులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం, సుప్రీం ఆదేశాలను పక్కనబెట్టి మొండిగా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏవిధంగా బుద్ధి చెప్పాలనే అంశంపై నేతలు తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు. 2006 మార్చి 3న ఆంధ్ర, మహారాష్ట్రల మధ్య వివాదం సమసే వరకూ బాబ్లీ కట్టకూడదని సీడబ్ల్యూసీ ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే 2006 ఏప్రిల్‌ 4వ తేదీన అప్పటి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌, వైఎస్‌ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను అఖిలపక్షం ముందు పెట్టాలని నిర్ణయించారు. దాంతోపాటు 2006 మే 20న ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్లీ గేట్లు నిర్మించవద్దంటూ సుప్రీం కోర్టు మహారాష్ట్రకు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించనున్నారు. ఇదిలాఉండగా 15 మంది బృందంతో కలిసి ఆదివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఒకవేళ అఖిలపక్షంలో ప్రధాని స్పందన ఆశాజనకంగా లేకపోతే అక్కడి నుంచే ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+