గాంధీనగర్: సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో గుజరాత్ మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేశారు. పరారీలో ఉన్న అమిత్ షాను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు గాలిస్తున్నారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పంపారు. రాజీనామాను మోడీ ఆమోదించారు. ఈ వ్యవహారంపై నరేంద్ర మోడీ మాట్లాడుతూ అమిత్ షా నిర్దోషని, ఆయనపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు.
తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, షా న్యాయపోరాటం సాగిస్తారని నరేంద్ర మోడీ చెప్పారు. రాజ్యాంగ నిబంధనల మేరకు తాను రాజీనామాను అమోదించినట్లు ఆయన తెలిపారు. తమపై కాంగ్రెసు కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.