హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పోలింగ్ ప్రారంభం: ఇవియంల మొరాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో ఇవియంలు మొరాయించాయి. కరీంనర్‌ జిల్లా వేములవాడలోని 160, 161 బూత్‌లలో ఏజెంట్లు లేక పోలింగ్‌ చాలా సేపు ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని పింగళి కళాశాల పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆలస్యమైంది. నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి లక్ష్మీనారాయణ పోలింగ్‌ తొలి నిమిషంలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో తెరాస నేత హరీష్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 460 ప్రాంతాలను సమస్యాత్మక, 450 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఇందుకోసం 68 వేల మంది సిబ్బందితో విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఈ ఉప ఎన్నికల్లో 435 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,783 పోలింగ్‌ కేంద్రాల్లో 2.35 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఐదింటిలో బ్యాలెట్‌ ద్వారా, ఏడింటిలో ఇవియంల ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దేశంలో తొలిసారిగా నియోజకవర్గానికి 10 చొప్పున 12 నియోజకవర్గాల్లో 120 సీసీ, వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కోసం 15 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈనెల 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X