హైదరాబాద్ లో చిన్న సినిమా ప్రభంజనం.. 'పెద్ది' ని దాటేసిన కలెక్షన్స్..!

ఇటీవలికాలంలో సినిమా ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసేవి. కానీ ఇటీవలి కాలంలో కంటెంట్ ఈజ్ కింగ్ అనే విధంగా చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలాగే తెలుగు సినిమాలే కాకుండా మలయాళం, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు సైతం సరైన కథతో వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. మరోవైపు ఇటీవలికాలంలో ఓటీటీల ట్రెండ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం మానేసారనే చెప్పాలి. సినిమా పెద్ద హిట్ అయితేనే థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి వచ్చేంతవరకూ ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఓ చిన్న సినిమా థియేటర్ల వద్ద సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆ సినిమాకు రోజు రోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ఆ మూవీని దాటి కలెక్షన్స్ ను రాబడుతోంది ఈ మూవీ. అదే హాలీవుడ్ మూవీ అబ్సెషన్.. ఈ మూవీని కేవలం రూ. 10 కోట్లతోనే నిర్మించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతోంది. ఈ సినిమాకు కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ దర్శకత్వం వహించడం విశేషం. తీసిన తొలి సినిమాకే అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

Obsession Beats Peddi in HyderabadSmall Film Creates Sensation with Housefull Shows and Huge Crowds

అబ్సెషన్ మూవీ రన్ టైమ్ గంటా 50 నిమిషాలు. ఈ మూవీ ప్రస్తుతం ఇంగ్లీష్ లో మాత్రమే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ ల్లో ఈ మూవీకి బుకింగ్స్ భారీగా నమోదవుతున్నాయి. మరి ఫుల్ రన్ లో ఎంత మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+