నాన్న మృతితో కొందరు పండుగ చేసుకున్నారు: వైయస్ జగన్

ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జగన్ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప నుంచి పర్యటనను రద్దు చేసుకుని ముమ్మిడివరంలోని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసంలో బస చేశారు. సోమవారం ఉదయం కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించింది. చేతికి ప్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన బ్యాండేజ్‌తో గాయం పెద్దది కావడంతో ప్రత్యేకంగా కట్టు కట్టించుకున్నారు. తరువాత ముమ్మిడివరం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించి మహిపాల చెరువు మీదుగా కాట్రేనికోన మండలానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications