వైయస్ జగన్ మనిషిని కాబట్టే నన్ను తొలగించారు: కుసుమ

అసలు ప్రభుత్వం అనేది ఉందా అని ఆమె ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తంచేశారు. ఒక విసిగా రాజకీయాల గురించి మాట్లాడవచ్చా అని ప్రశ్నించగా అసలు తాను ఈ పదవిలోకి వచ్చిందే రాజకీయ కారణంగానని ఆమె చెప్పారు. ఎక్కడైనా విసి నియామకంలో రాజకీయ కోణం ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. విసిగా తాను వైయస్ ప్రయోజనాలు కాపాడానని కూడా ఆమె వెల్లడించారు. వైఎస్ సామాజిక న్యాయం అనేవారని, అందుకే తాను మొత్తం 21 నియామకాలలో 16 మంది నిమ్నవర్గాలకు అవవకాశం కల్పించానని ఆమె చెప్పారు. తన భర్త భూమన్ తెలంగాణా వాది అని, తన మరిది భూమన కరుణాకర రెడ్డి ప్రస్తుతం జగన్‌తో పాటు ఓదార్పుయాత్రలో చురుకుగా పాల్గొంటున్నారని, ఈ రాజకీయ కారణాలవల్లే తనపై వేటు వేశారని ఆమె వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కావాలని తనపై దాడి చేసిందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications