వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకమాండ్ తో వైయస్ జగన్ రాజీకి ప్రయత్నాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో అధిష్టానానికి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. జగన్ సోమవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు పార్లమెంటు సభ్యులు మాట్లాడారు. ఇంత వరకు జరిగిందేదో జరిగింది, ఇకనైనా అధిష్టానంతో రాజీకి రావాలని కొంత మంది పార్లమెంటు సభ్యులు ఆయనకు సూచించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా జగన్ తో కొద్ది సేపు మాట్లాడారు. జరిగింది మరచిపోయి, ఇకనైనా అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఓదార్పు యాత్ర ఉద్దేశాన్ని, దానికి వచ్చిన స్పందనను జగన్ ఆయనకు వివరించినట్లు సమాచారం. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్‌తో కూడా ఆ తర్వాత శుక్లా సమావేశమయ్యారు.

సోమవారం పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు పార్లమెంటు సభ్యులు కిల్లి కృపారాణి, బాపిరాజు, అరుణ్ కుమార్, రాజమోహనరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, మజ్లిస్ ఎంపీ ఒవైసీ, ఎస్పీ ఎంపీ జయప్రద జగన్ తో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ కూడా జగన్ ‌తో కొద్ది సేపు మాట్లాడారు. ఇప్పటికైనా అధిష్టానం మాట వినాలని కొంత మంది పార్లమెంటు సభ్యులు సూచించినట్లు సమాచారం. అయితే, జగన్ మాత్రం ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. అయన ఎటు వెళ్తారనేది పార్లమెంటు సభ్యులకు కూడా పట్టడం లేదు. అయితే, భవిష్యత్తు కార్యాచరణ కోసం జగన్ పార్లమెంటు సభ్యుడు కెఎస్ రావు సలహాను కోరినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X