బాబ్లీ ప్రాజెక్టుపై నామా ధ్వజం: లోకసభలో బన్సల్ సమాధానం

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని గానీ కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యూసి) గానీ మహారాష్ట్రను నిలువరించడంలో సఫలం కాలేదని ఆయన అన్నారు. ప్రధాని మొక్కుబడిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారని ఆయన విమర్సించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు.
బాబ్లీ అంశం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఎక్కువగా మాట్లాడలేమని జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఇచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications